Published On: Mon, Apr 5th, 2021

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయండి

* హైకోర్టులో జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన పార్టీ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పుకు ఎస్‌ఈసీ తీరు విరుద్ధమని జనసేన స్పష్టం చేసింది. ఈ మేరకు హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి.. మధ్యాహ్నం 2.15కు విచారణ చేపట్టనుంది.మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ భాజపా కూడా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Just In...