Published On: Tue, Sep 10th, 2019

పల్నాడులో 144 సెక్షన్‌

* డీజీపీ గౌతమ్ స‌వాంగ్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి క్రైమ్‌: పల్నాడులో 144, 30 సెక్షన్‌ విధించామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు. కాగా, తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Just In...