Published On: Thu, Nov 29th, 2018

పాకిస్తాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులు విడుదలకు చర్యలు

* మంత్రి కళావెంకట్రావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన డి.మత్స్యలేశం 17, బడివానిపేట 3 , విజయనగరం జిల్లా చెందిన 4, ఈస్ట్ గోదావరి చెందిన న‌లుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుండి బయలుదేరి వెళ్ళారని వారికి అవగాహన లేకపోవడం వలన పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడం జరిగిందని. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేస్తూ పాకిస్థాన్ భద్రతాదళాలకు చిక్కు్కుపోయిన విషయాన్ని మంత్రి కళావెంకటరావు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు, ఏపీ భవన్ అధికారులు భారత రాయభార అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారని వారు పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కళావెంకటరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాక్ బలగాలకు చిక్కిన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాల మత్స్యకారులు వెనక్కి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందవద్దని జాలర్ల  విడుదలకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని వీరిని త్వరలోనే వారి స్వస్థలాలకు తరింలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కళావెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Just In...