Published On: Tue, Sep 25th, 2018

పాద‌యాత్ర పేరిట వైఎస్ జ‌గ‌న్ డ్రామాలు

* మంత్రి దేవినేని ఉమా

* గిరిజన ప్రాంతాన్ని అభివృది చేస్తున్న నేతలను చంపటం అమానుషం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అరకు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇద్దరు కూడా గిరిజన ప్రాంతాన్ని అభివృది చేస్తున్న నేతలని వారిని మావోయిస్టులు హ‌త్య గావించ‌డం అమానుషం అని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. సోమ‌వారం సాయంత్రం ఆయ‌న జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ మావోయిస్టుల చేతుల్లో మృతి చెందిన నేత‌ల కుటుంబ సభ్యులకు త‌న ప్రగాఢ సానుభూతిని వ్య‌క్త‌ప‌రిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరిట డ్రామాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. పాద‌యాత్ర మూడువేల కిలోమీటర్లు చేరుకుంద‌ని ప్ర‌జలకు అబద్దాల‌ను ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని, పోలవరం ప్రాజెక్టు అలస్యం అవ్వటానికి జ‌గ‌న్‌తో పాటు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మ కెవీపి రామ‌చంద్ర‌రావు కారణం కాదా అని ప్ర‌శ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనుల‌ను ఇప్పటి వరకు లక్ష మంది పైన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశార‌ని, ప్రతిపక్ష నాయకుడు గాని ఆ పార్టీ నాయకులు గాని పోలవరం ప్రాజెక్టును పరిశీలించకుండా పనులు జరగడంలేద‌ని జగన్ ఎలా అంటార‌ని ప్ర‌శ్నించారు. జగన్మోహన్ రెడ్డి యాత్ర మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద నోటి దూల తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ప్రపంచ దేశాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో సీఎం ప్రసంగం చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి సూచన చేస్తాడేమోని అనుకున్నాం. కాని సమస్యలపై స్పందించే గుణం జగన్మోహన్ రెడ్డికి లేద‌న్నారు. కేవలం త‌న పాదయాత్ర ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే అని ఆరోపించారు. రాయలసీమకు నీళ్ళు తరలించే అవుకు టన్నెల్ ప్రాజెక్టు ఆలస్యం అవటానికి జగన్మోహన్ రెడ్డి అయన బాబాయ్ కారణం అన్నారు. రాయలసీమలో తరతరాలుగా వైఎస్ కుటుంబానికి అన్ని పదవులు కట్టపెడితే ఇప్పటి వరకు అక్కడ రైతాంగానికి సాగునీరు ఇవ్వలేద‌న్నారు. రాయలసీమ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల‌ని మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. మావోల చేతుల్లో హ‌త్య‌కు గురైన నేత‌ల చిత్ర‌పటాల‌కు మంత్రి దేవినేని ఉమా నివాళుల‌ర్పించారు.

Just In...