Published On: Wed, Jan 9th, 2019

పారిశ్రామిక విధానాల‌ను ప్రోత్స‌హించాలి

* ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్.ఎస్ విన్నిపాత్రో 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: స్టార్టప్లను, వినూత్నమైన ఆలోచనలను, పారిశ్రామిక విధానాలను ప్రోత్సహించేందుకు ఔత్సాహిక వ్యక్తుల, సంస్థల ద్వారా వచ్చే పరిష్కార మార్గాలకు తగిన ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్.ఎస్ విన్నిపాత్రో తెలిపారు. బుధవారం ఆర్టీసీ బస్స్టాండ్ ఎన్టీఆర్ అడ్మిన్ బ్లాక్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సోచ్, ఇజ్రాయెల్ టెల్ ఆవివాహ్యాక్ధాన్ పరస్పర అవగాహనతో భారతదేశంలోను, ఇజ్రాయెల్ దేశంలోను ఎదుర్కుంటున్న వివిధ సమస్యలకు పరిష్కార అవిష్కరణలకు సూచనలను కోరడం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వినూత్నమైన ఆలోచనలకు ప్రసిద్ధి గాంచిందని, ఆ దేశంలో రూపొందించిన వివిధ సమస్యలకు పరిష్కారం ఎన్నో దేశాలకు అందించడం జరుగుతోందన్నారు. ఆ దిశలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సోచ్ విభాగం ఆధ్వర్యంలో ఇజ్రాయేల్తో గత ఆరు నెలలుగా సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ ప్రాంతంలో చూపిస్తున్న పరిష్కారాల దృక్పదంలో ఆలోచనలు చాలా బాగున్నాయన్నారు. ఇందుకోసం పరస్పరం ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకునే విధానంలో ఆయా ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఒక లక్షా 30 వేల ఆమెరికన్ డాలర్ల బహుమతులను అందించాలని నిర్ణయించామన్నారు. ఇందులో సగం భారతదేశం నుంచి వచ్చే ఆలోచనలకు, మరో సగం ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చే ఆలోచనలకు అందించడం జరుగుతుందన్నారు. ఆయా వినూత్నమైన ఆలోచనలకు, పరిష్కార మార్గాలకు మూడు విడతలుగా నగదు పురస్కారాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పరిష్కారం, అమలు విధానం ఆధారంగా పురస్కారాలను అందిస్తామన్నారు. వాస్తవికంగా ఎదుర్కుంటున్న సమస్యలను కనుగొని వాటికి తమదైన పరిష్కారాలను చూపేవాటిని స్వాగతించడం జరుగుతుందన్నారు. ఇకో ఫ్రెండ్లీ విధానాలలో ఆలోచనలను ప్రోత్సహించడం జరుగుతుందని వాటిని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయం, మున్సిపాలిటీల పరిధిలో త్రాగునీరు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలలో చొరవ చూపుతున్నామని, 250 కి పైగా ఆలోచనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇజ్రాయేల్తోనే కాకుండా ఫిన్‌ల్యాండ్ తదితర దేశాలతో కుడా హ్యాక్ధాన్ విధానాలను పరిశీలిస్తున్నామని విన్ని పేట్రో తెలిపారు. డిసిఎఫ్ వెంచర్స్ సీఈవో లక్ష్మీ పోట్లూరి మాట్లాడుతూ ఇరుదేశాలు ఉత్తమ ఆలోచనలకు చక్కని పరిష్కారం చూపాలనే విధానంలో అవగాహనతో ముందుకు వెళుతున్నామన్నారు. సైఐర్ సెక్యూరిటీ, త్రాగునీరు, వ్యవసాయం వంటి రంగాలలో ఇజ్రాయేల్ చాలా పటిష్టమైన స్థితిలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని వాటికి పరిష్కారాలను చూపుతున్నామన్నారు. ఆయా సమస్యలపై పరిశోధనలు చేసి సూచనలు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో నష్టాలను నివారణకు, సైబర్ సెక్యూరిటీ పైనా వినూత్నమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ అంశాలనే కాకుండా వాస్తవంగా ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను అందుకు చూపుతున్న పరిష్కారాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రోత్సహించే దిశలో అడుగులు వేస్తున్నామన్నారు. సమావేశంలో ఆసోసియేటెడ్ డైరెక్టర్ వినుత పాల్గొన్నారు.

Just In...