Published On: Mon, Apr 22nd, 2019

పార్కిన్‌స‌న్స్ వ్యాధి పట్ల అవగాహన అవ‌స‌రం

* 55 ఏళ్లు పైబడిన ప్రతి వందమందిలో ఒక‌రికి ఈ వ్యాధి సోకుతుంది
* డీప్‌బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీతో పూర్తి ఉపశమనం
 
* వాక్‌థాన్‌లో వెయ్యి మందికిపైగా హాజరు
* ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ తోట నవీన్
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పార్కిన్‌స‌న్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి వుండాలని, వ్యాధి లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం ద్వారా చికిత్స సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ తోట నవీన్ అన్నారు. ఆదివారం నగరంలోని అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెన్ లో ఆధ్వ‌ర్యంలో ఆదివారం వాక్థాన్ కార్యక్రమం మొగల్రాజ‌పురంలోని సిద్ధార్థ కళాశాల వద్ద ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది పైగా పాల్గొన్నారు. అనంతరం పార్కిన్సన్స్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ తోట నవీన్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే పార్కిన్‌స‌న్స్ వ్యాధి కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కండరాలు బిగుసుకుపోవడం, వణుకుడు, వంగిపోయి నడవడం, మందకొడిగా మారిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. 55 ఏళ్ల వయసు పైబడిన ప్రతి వందమందిలో ఒకరు పార్కిన్‌స‌న్స్ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. పార్కిన్సన్స్ వ్యాధి గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు సగటున ఐదేళ్ల సమయం పడుతోందని తెలిపారు. పార్కిన్‌స‌న్స్ వ్యాధి వల్ల వచ్చే సమస్యలను స్పాండిలోసిస్, కీళ్లవాతం, కీళ్లనొప్పులుగా భావించి సరైన చికిత్స తీసుకోపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలను పార్కిన్‌స‌న్స్ అవగాహన మాసంగా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగానే అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించామని చెప్పారు. అందుబాటులో వున్న అధునాతన విధానాల ద్వారా పార్కిన్‌స‌న్స్ వ్యాధికి మెరుగైన చికిత్స అందించవచ్చని అన్నారు. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఎపోమార్ఫిన్ అనే ఇంజెక్షన్ అందుబాటులో వుందని, వ్యాధి తీవ్రతను బట్టి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయడం ద్వారా రోగికి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. జీవన విధానాల్లో మార్పులు చేసుకోవడం, తగినంత వ్యాయామం ద్వారా పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని డాక్టర్ తోట నవీన్ సూచించారు. పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల ఆధునిక చికిత్సా విధానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అను న్యూరో అండ్ కార్డియాక్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే అందుబాటులో వున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి.రమేష్, న్యూరో సర్జన్ డాక్టర్ ఓసూరి బాలబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Just In...