Published On: Mon, Aug 19th, 2019

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి

సెల్ఐటి న్యూస్, రాంనగర్: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సీఈవో జంగా శ్రీనివాస్ కోరారు. గురువారం రాంనగర్ గుండూలోని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో ట్రస్ట్ చైర్ పర్సన్,  వ్యవస్థాపకురాలు కె.హెచ్.ఎస్.జగదాంబ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన జంగా శ్రీనివాస్ పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు. జగదాంబ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు వ్యాసర చన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కె.శ్యామలరావు, శ్రీకాంత్, పాషా పాల్గొన్నారు.

Just In...