Published On: Thu, Jul 23rd, 2020

పిడుగుపాటుకు మహిళ మృతి

* మరో ఇరువురి అస్వస్థత

ఉంగుటూరు, సెల్ఐటి న్యూస్‌: పిడుగుపాటుకు గురై ఓ గృహిణి దుర్మరణానికి గురైన సంఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పెద్దవుటపల్లి గ్రామాల మధ్య జరిగింది. సేకరించిన వివరాల ప్ర‌కారం … గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన నడ్డి రవమ్మ (34) పెద్ద అవుటుపల్లికి సమీపంలో గురువారం నారుమడి పనులకు వెళ్ళింది. పొలంలో నాట్లు వేస్తుండ‌గా ఒక్కసారిగా పిడుగు పడింది. కేవలం రెండు గజాల దూరంలో పిడుగు పడటంతో ఆమె అపస్మారక స్థితికి చెరుకుంది. ఈ సంద‌ర్భంలో ఆమె వెంట ఉన్న మరో ఇద్దరు కూలీలు బొగు వెంకమ్మ, ఆవల మరియమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారించారు.

Just In...