Published On: Tue, May 15th, 2018

పిడుగుపాటుపై అప్రమత్తంగా ఉండాలి

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు జారీ చేశారు. నీరు ప్రగతి, వ్యవసాయంపై సోమ‌వారం ఆయ‌న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ పిడుగుల సమాచారం గ్రామాలకు, ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

Just In...