Published On: Wed, Sep 9th, 2020

పీబీ సిద్ధార్థ‌లో నూత‌న కోర్సులు ప్రారంభం…

* టీసీయ‌స్ ఆధ్వ‌ర్యంలో ఏపీలోనే ‌తొలిసారిగా రూప‌క‌ల్ప‌న

(విజ‌య‌వాడసెల్ఐటి న్యూస్‌): ప‌ర్వ‌త‌నేని బ్ర‌హ్మ‌య్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీయ‌స్‌)తో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారిగా 2020-21 విద్యా సంవ‌త్స‌రం నుండి రెండు నూత‌న డిగ్రీ కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ తెలిపారు. బుధ‌వారం ఉద‌యం కళాశాల‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ విద్యారంగంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా ప్ర‌తి ఏటా నూత‌న కోర్సులను ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.
క‌ళాశాల డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ టీసీయ‌స్ సంస్థ అక‌డ‌మిక్ ఇంట‌ర్‌ఫేస్ ప్రోగ్రాం (ఏఐపీ) ద్వారా బీయ‌స్సీ (కాగ్నిటివ్ సిస్ట‌మ్స్ విత్ కంప్యూట‌ర్ సైన్స్‌), బీకాం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌) అనే రెండు నూత‌న డిగ్రీ కోర్సుల‌ను రాష్ట్రంలో ప్ర‌ప్ర‌ధ‌మంగా త‌మ క‌ళాశాల‌లో ప్రారంభించ‌డం గ‌ర్వ‌కార‌మని పేర్కొన్నారు. టీసీయ‌స్ అక‌డ‌మిక్ ఇంట‌ర్‌ఫేస్ ప్రోగ్రాం ద్వారా ఈ రెండు కోర్సుల‌కు పాఠ్యాంశాలను టీసీయ‌స్ సాఫ్ట్‌వేర్ సంస్థ‌కు చెందిన సాంకేతిక నిపుణులు రూప‌క‌ల్ప‌న చేశార‌ని, త్వ‌ర‌లో క‌ళాశాల‌కు చెందిన కంప్యూట‌ర్ సైన్స్ మ‌రియు కామ‌ర్స్ విభాగం అధ్యాప‌కుల‌కు టీసీయ‌స్ నిపుణులు ఈ ప్ర‌త్యేక కోర్సుల బోధ‌న కోసం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తార‌ని క‌ళాశాల డీన్ ప్రొఫెస‌ర్ రాజేష్ సి జంపాల తెలిపారు. ఈ కోర్సుల్లో చేరి డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ త‌మ సంస్థ‌లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ స‌ర్వీసెస్‌, బిజినెస్ ప్రాసెస్ స‌ర్వీసెస్ విభాగాల‌లో నేరుగా ఉపాధి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని క‌ళాశాల కంప్యూట‌ర్ సైన్స్ ఉప విభాగాధిప‌తి కావూరి శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. ఈ కోర్సుల్లో ప్ర‌వేశం పొందిన విద్యార్థుల‌కు టీసీయ‌స్ నిపుణుల ద్వారా పారిశ్రామిక సంబంధిత పాఠ్యాంశాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ‌, టీసీయ‌స్ కార్యాల‌యాల సంద‌ర్శ‌న‌, డిగ్రీ అనంత‌రం ఉపాధి అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఈ కోర్సుల‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు ప్ర‌త్యేక ప్రాంగ‌ణ ఎంపిక‌, ఉద్యోగ నైపుణ్యాల‌పై శిక్ష‌ణ అందిస్తామ‌ని కామ‌ర్స్ విభాగం ఉప విభాగాధిప‌తి కోనా నారాయ‌ణ‌రావు తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు, పాళ్యాంశాల‌కు
మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని త‌గ్గించ‌డ‌మే ఈ కోర్సుల ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు.

Just In...