Published On: Sat, May 12th, 2018

పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌కు… ప్ర‌తిష్టాత్మ‌క అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూట‌ర్ అవార్డు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌: ప‌ర్వ‌త‌నేని బ్ర‌హ్మ‌య్య సిద్ధార్థ క‌ళాశాల‌కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్స్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ చెన్నైలో నిర్వ‌హించిన సేల్స్‌ఫోర్స్ అక‌డ‌మిక్ స‌మ్మిట్‌-2018 స‌ద‌స్సులో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూట‌ర్ అవార్డును ప్ర‌దానం చేసింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ‌ ఐసిటి అకాడ‌మీ స‌హ‌కాంతో దేశ‌వ్యాప్తంగా 100కి పైగా క‌ళాశాల‌ల్లో ఇటీవ‌ల 24 గంట‌ల పాటు న్యూ ఇండియా స్టూడెంట్స్ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు నిర్వ‌హించి ప్ర‌తి రాష్ట్రం నుండి అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన క‌ళాశాల‌కు ఈ అవార్డు ప్ర‌ధానం చేశారు. ప్ర‌స్తుత కార్పోరేట్ సంస్థ‌ల్లో అత్య‌ధికంగా ఉపాధి అవ‌కాశాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న సేల్స్‌ఫోర్స్ సాఫ్ట్‌వేర్ వినియోగం ప‌ట్ల విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దేశ‌వ్యాప్తంగా ఐసిటీ అకాడ‌మీ ఆయా క‌ళాశాల‌ల్లో 24 గంట‌ల పాటు సేల్స్‌ఫోర్స్ ట్ర‌య‌ల్ హెడ్ ద్వారా సాంకేతిక అంశాల‌ను నేర్చుకొని ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో విద్యార్థులు సాధించిన బ్యాడ్జీలు, పాయింట్ల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ తెలిపారు. ఈ పోటీల‌కు ఎంతో ఆస‌క్తిగా 24 గంట‌ల పాటు క‌ళాశాల కంప్యూట‌ర్ సెంట‌ర్‌లో స‌మ‌యం వెచ్చించి విష‌య ప‌రిజ్ఞానంతో పాటు పోటీత‌త్వంతో ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల్లో అత్య‌ధిక పాయింట్లు సాధించి క‌ళాశాల ప్ర‌తిభ‌హ‌ను జాతీయ స్థాయిలో చాటిన విద్యార్థుల‌ను, పోటీల నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన కంప్యూట‌ర్ సైన్స్ విభాగం ఉప విభాగాధిప‌తి కావూరి శ్రీధ‌ర్‌ను క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్‌, డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ సి జంపాల అభినందించారు. సేల్స్‌ఫోర్స్ ట్ర‌య‌ల్ హెడ్ గ్లోబ‌ల్ డైర‌క్ట‌ర్ షిర్లిన్ చౌ, సీనియ‌న్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ భానోత్, ఐసిటీ అకాడ‌మీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి ఎం.శివ‌కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును కావూరి శ్రీధ‌ర్‌కు ఈ నెల 8న చెన్నైలో జ‌రిగిన అక‌డ‌మిక్ స‌మ్మిట్‌లో అంద‌జేసిన‌ట్లు తెలిపారు. అరుదైన ఘ‌న‌త సాధించిన క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థుల‌ను ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ అకాడ‌మీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లు, పాల‌డ‌గు ల‌క్ష్మ‌ణ‌రావు, కోశాధికారి సూరెడ్డి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌న్వీన‌ర్ పి.ఎల్‌.ఎన్‌.ప్ర‌సాద్ అభినందించారు.

Just In...