Published On: Sun, Jul 5th, 2020

పీబీ సిద్ధార్థ విద్యార్థినికి డాక్ట‌రేట్ ప్ర‌దానం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప‌ర్వ‌త‌నేని బ్ర‌హ్మ‌య్య సిద్ధార్థ క‌ళాశాల విద్యార్థిని మాగంటి సుధారాణికి ఆచార్య ‌నాగార్జున విశ్వవిద్యాల‌యం పీహెచ్‌డీ ప్ర‌దానం చేసిన‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌ణిత శాస్త్రంలో *న్యూమ‌రిక‌ల్ ఎక్స్‌ప్లోరేష‌న్ ఆఫ్ హీట్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆన్ హైడ్రోమాగ్న‌టిగ్ పార్టిక‌ల్ సస్పెన్ష‌న్ ఫ్లోస్‌* అనే అంశంపై నాగార్జున విశ్వ‌విద్యాల‌యం గ‌ణిత విభాగం ఆచార్యులు డాక్ట‌ర్ ఎం.జ్ఞానేశ్వ‌ర రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌రిశోధ‌న పూర్తి చేసిన‌ట్లు ప్రిన్సిపాల్ ర‌మేష్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల యాజ‌మాన్యం త‌ర‌ఫున సిద్ధార్థ అకాడ‌మీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లు, పాల‌డుగు ల‌క్ష్మ‌ణ‌రావు, క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు సుధారాణిని అభినందించారు. ‌

Just In...