Published On: Thu, Dec 6th, 2018

పురుగుమందు సేవించి వ్య‌క్తి ఆత్మహత్య

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ఉంగుటురు మండలం ఆత్కూరులో అన్నే శ్రీనివాసరావు(43) అనే వ్య‌క్తి పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. సేకరించిన వివరాల ప్రకారం. అన్నే శ్రీనివాసరావు బుధవారం రాత్రి తన తండ్రితో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా అర్థరాత్రి పురుగుమందు తాగి బాత్‌రూం దగ్గర పడిఉన్నాడు. తల్లి చుట్టుపక్కల వారి సహాయంతో చిన ఆవుటపల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. ఇతడు మొదట ఉష అనే ఆమెను వివాహం చేసుకొని గొడవల వల్ల ఆమెను 6 ఏళ్ల క్రితం వదలివేసి మళ్ళీ అపర్ణ అనే ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. వారికి 5ఏళ్ల బాబు ఉన్నాడు. వారి మధ్య గొడవలు రావడంతో ప్రస్థుతం వేరుగా వుంటున్నారు. ఇతను వ్యవసాయం చేస్తుంటాడు. పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Just In...