Published On: Thu, Jul 29th, 2021

పులుల సంరక్షణ చర్యలు పటిష్టంగా కొనసాగించాలి

* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

* సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం

అమరావతి: సెల్ఐటి న్యూస్‌: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పులుల సంరక్షణకోసం తీసుకున్న చర్యలను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని తెలిపిన అధికారులు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. టైగర్‌ రిజర్వ్‌ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు. పులుల దినోత్సవం సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను సీఎం వైయెస్ జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌.ప్రతీప్‌ కుమార్, అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Just In...