Published On: Tue, Sep 17th, 2019

పేకాట ఆడిన కానిస్టేబుల్ – సస్పెండ్ చేసిన ఎస్పీ

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు క్రైం: గుంటూరు అర్బన్ జిల్లాలో పేకాట ఆడుతూ పట్టుబడిన కానిస్టేబుల్‌ను విదుల నుండి తొలగించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అద్దెపల్లి రాజు (4693) ఈ నెల 9వ తేది రాత్రి మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామంలో పేకాట ఆడుతుండగా మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాల్సిన పోలీస్ శాఖలో నియమాలకు విరుద్దంగా వ్యవహరించినందకు సస్పెండ్ చేసినట్లు ఎస్పీ రామ‌కృష్ణ తెలిపారు.

 

Just In...