Published On: Fri, Sep 8th, 2017

పేద‌ల‌కు అండ‌గా ఉండ‌డ‌మే జీవితాశ‌యం

* సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, కర్నూలు: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని తెలిపారు. శుక్ర‌వారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్ర‌బాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని, తద్వారా నీటి సమస్యను అధిగమించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం ఉండదని తెలిపారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమివ్వడమే లక్ష్యమని తెలిపారు. అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు. రాజధాని నిర్మాణానికి కొంతమంది అడ్డుపడుతున్నారని, కులం, మతం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నొక్కి వక్కాణించారు. ఈ సందర్భంగా జలసంరక్షణకు పాడుపడేందుకు కృషి చేస్తామంటూ సభలో పాల్గొన్న అందరితోనూ సీఎం ప్రమాణం చేయించారు. అంతకుముందు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు జాతికి అంకితమిచ్చారు. అనంతరం పంప్‌హౌస్‌, హెడ్‌ వర్క్స్‌ను పరిశీలించారు. తర్వాత ముచ్చుముర్రిలో జలసిరికి హారతిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.

cm_muchumarri_canal_inuagration_2 cm_muchumarri_canal_inuagration_1 cm_muchumarri_canal_inuagration_4 cm_muchumarri_canal_inuagration_3

Just In...