Published On: Sat, Feb 22nd, 2020

పేద‌ల‌కు బాస‌ట‌గా టైమ్ హాస్పిటల్స్ ఉచిత వైద్య సేవ‌లు

* గ‌త పదేళ్లుగా ఏటా వైద్యశిబిరం నిర్వహిస్తూ వస్తున్న ఆసుప‌త్రి యాజ‌మాన్యం

* టైమ్ సేవలను కొనియాడుతున్న శివ భక్తులు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యనమలకుదురులో కొలువైయున్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహాదేవుడిని కొలిచేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తుల కోసం టైమ్ హాస్పిటల్స్ ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం ద్వారా భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. గత పదేళ్లుగా ప్రతిఏటా మహాశివరాత్రి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ వస్తున్న టైమ్ హాస్పిటల్స్ ఈ ఏడాది కూడా శివ భక్తులకు ఉచిత వైద్య సేవలందిస్తోంది. ప్రముఖ న్యూరో సర్జన్, టైమ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురుకు తరలివస్తున్న భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు సాధారణ వైద్య సేవలు అందించడంతో పాటుగా, వివిధ విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులను ఈ ఉచిత వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచి భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరం ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, గడచిన దశాబ్ద కాలంగా మహాశివరాత్రి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి భక్తులకు సేవలందిస్తున్నామని డాక్టర్ పువ్వాడ రామకృష్ణ పేర్కొన్నారు. టైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల స్థానికులతో పాటు, మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులు హర్షం నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఉచిత వైద్య శిబిరం ద్వారా మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలందించడం అభినందనీయమని టైమ్ హాస్పిటల్స్ నిర్వాహకులను భక్తులు కొనియాడుతున్నారు.

Just In...