Published On: Wed, Aug 26th, 2020

పేద విద్యార్థినికి మ‌హా అండ‌…!‌

(*జ‌న‌ర‌ల్ డెస్క్‌, సెల్ఐటి న్యూస్*‌): ‌మహారాష్ట్ర సింధూదుర్గ్ జిల్లాలోని డారిస్టే గ్రామంలోని స్వప్నాలి సుతార్… ముంబై వెటర్నరీ కాలేజీలో చదువు…. తన గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఆన్‌లైన్ తరగతులను మిస్ అవకూడదని తన గ్రామానికి 2కిలోమీట‌ర్ల దూరంలోని కొండపై షెడ్ ఏర్పాటు చేసుకొని తరగతులకు హాజర‌వుతుండడం గుర్తించిన ప్రధానమంత్రి కార్యాలయం యుధ్ద ప్రాతిపదికన ఆ విద్యార్థిని ఇబ్బందులు తోలగిస్తూ సమాచార శాఖ మరియు విద్యా శాఖలకు ఆదేశాలు పంపింది.
దీంతో త‌క్ష‌ణం గ్రామ పంచాయితీ నుండి విద్యార్థిని ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఇకపై ఆన్‌లైన్ తరగతులకు అంతరాయం లేకుండా పొందేటట్లు అన్ని ఏర్పాట్లు చేసి భ‌రోసా ఇచ్చారు. ఇది పాలన అంటే…. దేశం మారుతోంది.. చాప క్రింద నీరులా..నిశ్శబ్దంగా…!

Just In...