Published On: Tue, Sep 10th, 2019

పోటీ పరీక్షలకు అవగాహన..

* రిటైర్ట్ ఐఎఎస్ అధికారి బి.రామాంజనేయులు

సెల్ఐటి న్యూస్, విజయవాడ: తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి అవగాహన సదస్సును ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహిస్తున్నట్టు ద బెస్ట్ ఐఎఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ బి.రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో సివిల్ సర్వీసెస్ సక్సెస్ రేటును పెంచడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సు ఇన్ఫాం మరియు ద బెస్ట్ ఐఎఎస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అవగాహన కార్యక్రమంలో ఏపి స్టేట్ సీడ్స్ డవలపేమెంట్ కార్పొరేషన్ ఎండీ డా.గడ్డం శేఖరబాబు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బి.రామాంజనేయులు, న్యూజిలాండ్చెందిన వేల ఎర్రా మధుకుమార్, ఇన్ఫాం అధ్యక్షులు గడ్డం బాపిరాజు ఇంకా పలువురు నిపుణులచే సూచనలు, సలహాలు అందిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవగాహన సదస్సుకు హాజరుకావాలని రామాంజనేయులు కోరారు.

Just In...