Published On: Mon, Sep 11th, 2017

పోటు కార్మికులకు అగ్నిమాపక సిబ్బంది శిక్షణ

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారుచేసే పోటులో విధులు నిర్వహిస్తున్న పోటు కార్మికులకు శనివారం ఉద‌యం అగ్నిమాపక అధికారులు ప్రత్యేక శిక్షణనిచ్చారు. తిరుమల శ్రీవారి ప్రసాదలైన లడ్డూలకు సంబంధించిన బూందిని తయారు చేస్తునప్పుడు ఏదేనైఆ అగ్ని ప్రమాదాలు సంభవించిన పక్షంలో వెంటనే మంటలను ఎలా ఆర్పాలి అనే అంశంపై అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా పోటు కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తితిదే సి.వి.ఎస్‌.ఓ. ఆకె.రవికృష్ణ, ఎ.డి.ఎస్‌.ఓ. శ్రీహరిజగన్నాధం, ఆలయ డిప్యూటి.ఈ.ఓ. కోదండరామారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సి.వి.ఎస్‌.ఓ, ఎ.డి.ఎస్‌.ఓలు తిరుమలలో ఉన్న గ్యాస్‌ ప్లాంట్‌ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అక్కడ అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. భవిష్యత్తులో తిరుమలలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సంద‌ర్భంగా తితిదే అధికారులు అభిప్రాయపడ్డారు.

potu_2_11-09-17 potu_1_11-09-17

Just In...