పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి
* సీపీఐ నేత కె.రామకృష్ణ
అమరావతి, సెల్ఐటి న్యూస్: పోలవరం నిర్వాసితులకు ఆర్& ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలని సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ మంగళవారం లేఖ రాశారు. పోలవరం నిర్మాణ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. అపోహలకు తావు లేకుండా పోలవరం సందర్శనకు అఖిలపక్షాన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు.