Published On: Sun, Nov 4th, 2018

పోలవరం సమీపంలోని మట్టిరోడ్డుపై పగుళ్లు

* ప‌రుగులు తీసిన కార్మికులు

సెల్ఐటి న్యూస్‌, జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద శ‌నివారం మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా కలకలం రేగింది. ప్రాజెక్ట్‌కు వెళ్లే రహదారి బీటలు వారడంతో భూకంపం వచ్చిందంటూ కార్మికులు పరుగులు తీశారు. రహదారిపై బీటలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. ఈ కారణంగా పోలవరం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పోలవరం సమీపంలోని మట్టిరోడ్డు పగుళ్లపై ప్రభుత్వం వివరణ కోరింది. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని ఆర్టీజీఎస్‌ స్పష్టం చేసింది. మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది.

Just In...