Published On: Tue, Apr 16th, 2019

పోలింగ్‌ రోజున ఈవీఎంలు ఒకే సమయంలో ఎందుకు మొరాయించాయి

* ఈసీ నుంచి సరైన జవాబు రాలేదు

* ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: పోలింగ్‌ రోజున ఈవీఎంలు ఒకే సమయంలో ఎందుకు మొరాయించాయని అడిగితే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ చెప్పినట్టే ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే పోలింగ్‌ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.

Just In...