Published On: Sat, Nov 30th, 2019

పోలీస్ అమ‌ర‌వీరుల త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం…

* ఏపి డీజీపి గౌతం స‌వాంగ్‌

* న్యూఢిల్లీలోని పోలీస్ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద ఘ‌న నివాళి

సెల్ఐటి న్యూస్‌, న్యూఢిల్లీ: దేశ రక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేసిన పోలీసు అమర వీరులందరికి ఆంధ్రప్రదేశ్ డీజీపి డి.గౌతమ్ సవాంగ్ న్యూ ఢిల్లీలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగానికి చిహ్నంగా ఢిల్లీలో నిర్మించిన జాతీయ పోలీస్ సంస్మరణ స్థూపం వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందం, డిజిపి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఏపికి చెందిన 606 మంది పోలీసు అధికారులు, ముగ్గురు ఐపిఎస్ అధికారులు తమ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని, వారి అమూల్యమైన నిబద్దతతో కూడిన విధి నిర్వహణ అందరికి ఆదర్శప్రాయమని, అట్టి అమరవీరులను గుర్తుచేసుకుని ఘనంగా నివాళులు అర్పించడం మన అందరి బాధ్యత అని ఆయన ఉద్భోదించారు.  దేశ రాజధానిలో నిర్మించబడిన జాతీయ పోలీసు సంస్మరణ స్థూపం వద్ద రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందం నివాళులు అర్పించడం, ప్రత్యేకంగా కవాతులు నిర్వహించడం దానిలో తాను పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1959 వరకు భారత్ – టిబెట్‌ల మధ్య వున్న 2500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం పోలీసు శాఖ రక్షణలోనే ఉండేది. 1959 అక్టోబర్ 20న వీరమరణం పొందిన సీఆర్ పిఎఫ్ జవాన్లు, పోలీసు సిబ్బంది ప్రాణత్యాగానికి ప్రతీకగా నిర్మించిన జాతీయ పోలీసు సంస్మరణ స్థూపం నాటి అమరవీరుల త్యాగం, వీరగాధలను మనకు తెలియచేస్తూ ప్రతిక్షణం విధినిర్వహణలో పోలీసుల బాధ్యతను గుర్తు చేస్తుంటుంది. సంస్మరణ స్తూపం వద్ద అన్ని రాష్ట్రాలు నివాళులు అర్పించుకొనేలా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకత్వంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళుల‌ర్పించే కార్యక్రమాన్ని ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా పర్యవేక్షణలో ఘనంగా  జరిగింది. కార్యక్రమానికి శ్రీనివాస్, విశాఖపట్నం సిపి ఆర్ కె మీనా, డిజి పాలరాజు, ఏ ఐ జి (ఎల్&ఓ) రాజశేఖర్ బాబు, గ్రేహౌండ్స్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి, నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, అనంతపురం ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు, చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పటేల్, ప్రకాశం ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్, 5వ బెటాలియన్ కమాండెంట్ కోటేశ్వరరావు తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రద్ధాంజలి ఘటించిన పిదప జాతీయ పొలీసు ఏర్పాటు చేసిన మ్యూజియంను సందర్శించి అక్కడే పొరుగు రాష్ట్రాల పొలిసు శాఖల యొక్క వీరోచిత త్యాగాలను సందర్శించుట జరిగింది. అనంతరం ఎపి రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసుల యొక్క వీరోచిత పోరాటాలపై తీసిన లఘు చిత్రాలను డీజిపి వీక్షించారు. కార్యక్రమాన్ని ఎపి పోలీస్ ప్రత్యేక దళాలు రిజర్వు ఇన్స్పెక్టర్లు  కెకెఎం రాజు, డి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కమాండెంట్ జె.కోటేశ్వరరావు మరియు గ్రెహాండ్స్ గ్రూప్ కమాండర్ రాహుల్దేవ్ శర్మల పర్యవేక్షణలో ముందుగా కవాతు కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వారి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎపి పొలిసు బృందానికి పరేడ్ కంమాండర్‌గా వి.హనుమంతు, రిజర్వు ఇన్స్పెక్టర్ బి.పెంటారావు, బ్యాండ్ బృందానికి రిజర్వు ఇన్‌స్పెక్ట‌ర్ సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీలోని తెలుగు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ తెలుగు సంఘాల ప్రముఖులు విచ్చేసి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

Just In...