Published On: Fri, Sep 27th, 2019

పోలీస్ క్వార్ట‌ర్స్‌లో ఉరి వేసుకొని సీఐ ఆత్మ‌హ‌త్య‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ హనుమాన్‌పేట పోలీస్ క్వాటర్స్ లో సీఐ సూర్యనారాయణ గురువారం ఉద‌యం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 1989 బ్యాచ్‌కి చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏ. ఆర్ గ్రౌండ్స్ లో సిఐగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. 1990 బ్యాచ్‌కి చెందిన వారు కూడా డీఎస్పీలుగా పదోన్నతి పొందినప్పటికీ… సూర్య నారాయణకు రిమార్క్స్ కారణంగా ప‌దోన్న‌తి లభ్యం కాలేదు. ఈ క్ర‌మంలో ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన సూర్యనారాయణ పదోన్నతి లేక అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా  అన్న కోణంలోనూ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...