Published On: Mon, Apr 15th, 2019

పోలీస్ రామాలయంలో వైభ‌వంగా సీతారాముల క‌ల్యాణం

* క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్ దంపతులు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ మ‌హాత్మాగాంధీ రోడ్డెలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న పోలీస్ రామాలయంలో సీతారాముల క‌ల్యాణాన్ని ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు.నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, స్వామివార్లకు పోలీస్ కమీషనర్ దంపతులు పట్టువస్త్రాలను సమర్పించి, సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ దంపతులు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 22 వరకు నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు సీతారాముల వారికి విశిష్ట పూజలను నిర్వహించి ముగింపు కార్యక్రమంలో మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించ‌నున్నారు. స్వామివారి క‌ల్యాణంలో విజయవాడ నగర క్రైమ్ డిసిపి రాజకుమారి, లా & ఆర్డర్-2 డిసిపి వెంకట అప్పలనాయుడు, లా & ఆర్డర్-1 డిసిపి వి.హర్షవర్ధన రాజు, అడ్మిన్ డిసిపి డి.కోటేశ్వరరావు, సి.ఎస్.డబ్ల్యూ. డిసిపి ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, ట్రాఫిక్ డిసిపి వై.రవిశంకర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏ.డి.సి.పి నవాబ్ జాని, విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ ప‌రిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ రామలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Just In...