పోలవరపు చంద్రబాబుకు మాజీ సీఎం చంద్రబాబు నివాళి
అమరావతి, సెల్ఐటి న్యూస్: ఇటీవల గుండెపోటుతో మరణించిన తెలుగు యువత కార్యదర్శి పోలవరపు చంద్రబాబు మృతికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలవరపు చంద్రబాబు చిత్రపటానికి నారా చంద్రబాబు నాయుడు పూలు జల్లి సంతాపం వ్యక్తం చేశారు. పోలవరపు చంద్రబాబు కుటుంబ సభ్యులకు నారా చంద్రబాబు నాయుడు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ టిడిపి నేతలు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు.