Published On: Mon, Dec 2nd, 2019

పౌర సమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

* ముఖ్యమంత్రి నిర్ణయంతో లక్షల సంఖ్యలో సమస్యలకు పరిష్కారం

* పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం – ప్రజల్లో ఆనందం

* వైయస్ జగన్‌ 6 నెలల పాలనలో అతిపెద్ద విజయం

* 8,15,461 వినతుల్లో 78.2 శాతం పరిష్కారం

* పోలీసుల వద్దకు నేరుగా వచ్చిన 44వేల ఫిర్యాదుల్లో 98 శాతం పరిష్కారం

* ఆన్‌లైన్‌లో వచ్చిన 8,894 ఫిర్యాదుల్లో 94 శాతం పరిష్కారం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్‌ సందర్బంగా స్పందన కార్యక్రమాన్ని ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ క‌ల సాకారం దిశ‌గా ముందుకు సాగుతుంది. వివిధ సమస్యలపై పౌరుల నుంచి వినతుల పరిష్కారం, నిర్ణీత కాలంలో పరిష్కారమే లక్ష్యంగా స్పందన కార్యక్రమం క్రమం తప్పకుండా సమీక్షలతో స్పందనపై అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్‌ తీసుకువచ్చిన సీఎం యథాలాపంగా కాకుండా ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా స్పందన కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులనూ కేటాయించిన సీఎం. ఆకస్మిక తనిఖీలకూ ఆదేశాలు ఇచ్చిన సీఎం. రోజుల తరబడి తమ తమ సమస్యల పరిష్కారంకోసం కాళ్లరిగేలా తిరిగిన ప్రజలకు అధికారులనుంచి జవాబుదారీతనం. సమస్యకు రశీదు, పరిష్కారం పొందిన తర్వాత మళ్లీ ప్రజలకు తెలియజేసేలా విధాన రూపకల్పన. తిరస్కరించిన వాటికీ సహేతుక కారణాలతో వివరణ. పెండింగులో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం. ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై స్పందనలో లక్షల కొద్దీ వినతులు వ‌స్తున్నాయి.

– స్పందన ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 13 జిల్లాల్లో వచ్చిన వినతులు 8,15,461
– పరిష్కారానికి నోచుకున్న వినతులు 78.2 శాతం, పెండింగులో 7.3 శాతం, తిరస్కరించినవి 14.4 శాతం
– రేషన్‌ కార్డులు, ఇళ్లపట్టాలు, పట్టణాల్లో ఇళ్లు, పెన్షన్లు, భూమి సంబంధిత హక్కులు, ఇళ్ల మంజూరు, ఆక్రమణలు… సంబంధిత అంశాలే ఎక్కువ.
– తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వినతులు
– కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆతర్వాత సంఖ్యలో వినతులు

– తూర్పుగోదావరిలో 1,09,876 వినతులు, 80శాతం పరిష్కారం
– కర్నూలులో 99,577, 82.4శాతం పరిష్కారం
– కృష్ణాజిల్లాలో 97,355 , 78.9శాతం పరిష్కారం
– గుంటూరు జిల్లాలో 82,031, 71.2 శాతం పరిష్కారం
– అనంతపురం జిల్లాలో 70,310, 84.2 శాతం పరిష్కారం
– ప.గో. జిల్లాలో 68,125 వినతులు, 79.1శాతం పరిష్కారం
– విశాఖపట్నం జిల్లాలో 61,613 వినతులు, 75.7శాతం పరిష్కారం
– కడప జిల్లాలో 52,318 వినతులు, 74.7 శాతం పరిష్కారం
– చిత్తూరు జిల్లాలో 48,008 వినతులు, 73.7 శాతం పరిష్కారం
– ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో 36,998 వినతులు, 76.1శాతం పరిష్కారం.
– శ్రీకాకుళం జిల్లాలో 33,228 వినతులు, 78.9శాతం
– ప్రకాశం జిల్లాలో 31,829 వినతులు, 70.8శాతం పరిష్కారం
– విజయనగరం జిల్లాలో 24,193 వినతులు, 86.6 శాతం పరిష్కారం

– వినతుల్లో నాణ్యత పెంచడానికి శ్రీ వైయస్‌.జగన్‌ చర్యలు
– అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహించారు.
– జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

పోలీసు శాఖలో స్పందన కార్యక్రమం:

– ప్రతి మంగళవారం జిల్లా ఎస్పీలు, పోలీసు అధికారులతో సీఎం సమీక్ష
– వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
– ఫిర్యాదులతో వస్తున్నవారిని మానవతా దృక్పథంతో చూడాలంటూ ఆదేశాలు
– పోలీసు స్టేషన్లు, కార్యాలయాల ముందు హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు
– సివిల్‌ తగాదాలు తక్షణ పరిష్కారానికి రెవిన్యూ అధికారులతో ప్రత్యేక సమన్వయం ఏర్పాటు చేసిన సీఎం
– నవంబర్‌ 25వరకూ, ఇప్పటివరకూ వచ్చిన పిటిషన్లు 44,452 వినతులు. 98శాతం ఫిర్యాదుల పరిష్కారం
– స్పందన వెబ్‌పోర్టల్‌ ద్వారా 8,894 వినతులు. 94 శాతం పరిష్కారం

నేరుగా వచ్చిన పిటిషన్లలో వర్గీకరణ:

– సివిల్‌ తగాదాలు 11,525
– బాడీలైన్‌ అఫెన్సెస్‌ 7,188
– మహిళలపై నేరాలకు 6,773
– ఇతర ఫిర్యాదులు 5,490
– వైట్‌కాలర్‌ అఫెన్స్‌లు 4,733
– కుటుంబ తగాదాలు 3,786
– ఆస్తి సంబంధమైన తగాదాలు 2,462
– న్యూసెన్స్‌ 1010
– రోడ్డు ప్రమాదాలు 966
– సైబర్‌ క్రైం 274
– ఎస్సీ,ఎస్టీలపై నేరాలు 245

స్పందన ఇంపాక్ట్‌:

– స్పందన కార్యక్రమం వల్ల నేరుగా వచ్చిన 44,452 స్పందన వినతుల్లో
13003 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు.
– వారంరోజుల్లోనే 95శాతం ఫిర్యాదుల పరిష్కారం.
– ముఖ్యమంత్రి, డీజీపీల స్వయం పర్యవేక్షణ వల్ల పోలీసు యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీ తనం పెరిగింది.
– నిర్ణీత కాలంలోగా వినతులను పరిష్కరించని పోలీసులపై చర్యలు.
– మహిళల నుంచి 52శాతం ఫిర్యాదులు. సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని మహిళల్లో విశ్వాసానికి కొలమానం.
– సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సులభంగా అందుబాటులో అధికారులు.
– సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు, తద్వారా చర్యలు ద్వారా కొన్ని సంవత్సరాలు తరబడి పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి.

Just In...