Published On: Thu, Jan 14th, 2021

పౌర సరఫరాల సంస్థకు రాష్ట్ర ఆర్ధిక శాఖ నిధులు…

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన 15 రోజులకు పైబడిన బకాయిల చెల్లింపుల నిమిత్తం రూ.1000 కోట్ల నిధులను రాష్ట్ర ఆర్ధిక శాఖ వారు పౌర సరఫరాల సంస్థకు బుధ‌వారం విడుదల చేశారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలలోకి నేరుగా చేరే విధంగా బ్యాంకుల్లో జమచేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే చెల్లించడం జరుగుంద‌న్నారు. ఇంకా కొనాల్సిన ధాన్యం రైతులవద్ద నుండి పూర్థిస్థాయిలో కొనుగోలు చేసి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవటం జరుగుతుంద‌ని తెలిపారు.

Just In...