Published On: Mon, Aug 19th, 2019

ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసమే స్పందన

* ఆర్డీఓ గుత్తుల వెంకట సత్యవాణి

సెల్ఐటి న్యూస్, గుడివాడ: ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని డివిజన్ పరిధిలోని శాఖల వారిగా అధికారులు తమ పరిధిలో గల అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందజేయాలని ఆర్డీఓ గుత్తుల వెంకట సత్యవాణి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాబోయే ఉగాది నాటికి 25 లక్షల ఇంటి స్థల పట్టాలను అర్హులైన వారందరికీ అందించాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈదిశగా మండలాల వారి గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు అవసరం మేరకు భూసేకరణ చేపట్టి సర్వే నిర్వహిస్తున్నామని, ఈ మేరకు మండల తహాసిల్దార్లకు, సర్వేయర్లకు ఆదేశాలు జారీచేసామన్నారు. సోమవారం స్పందన కార్యక్రమం లో 200 వరకు అర్జీలు వచ్చాయని, వాటిలో ఎక్కువుగా ఇళ్లస్థల పట్టాలు ఉన్నాయని, మిగిలినవి రేషన్ కార్డులు, పెన్షన్, రెవిన్యూ, భూమి సర్వేలకు సంబందించినవని ఆర్డీఓ సత్యవాణి తెలిపారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి రిజిష్టర్ లో నమోదు చేసి ఆన్ లైన్ చేస్తున్నామని, ఇంటి స్థల పట్టణాలకు సంభందించి నేరుగా అధికారులు వారి ఇంటికి వెళ్లి వారి అర్హతలను పరిశీలించి పరిగణంలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హులయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్డీఓ సత్యవాణి అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యం తో వార్డు, గ్రామ వాలేంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆగస్టు 15 నుండి వాలేంటీర్లను విధుల్లోనికి తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి వాలేంటరీ వారి పరిధిలోని గ్రామ, పట్టణాల్లో 50 కుటుంబాల యొక్క సమాచారం క్రోడీకరించి వారికి ప్రభుత్వ పథకాల ద్వార వచ్చే లబ్దిని అందజేస్తారన్నారు. డివిజన్ పరిధిలోని అధికారులందరు శాఖాపరంగా వారు అమలుచేస్తున్న పథకాల వివరాలను పూర్తీ స్థాయిలో గ్రామా వాలేంటీర్లకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ప్రతి పథకం వార్డ్, గ్రామా వాలేంటర్ల ద్వారానే అమలు చేయాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశ్యామన్నారు.
అర్జీలు….
గుడివాడ పట్టణం ఆదర్శనగర్ కు చెందిన దండియాల కస్తూరి, పొనుకుమాటి స్వప్న ఇతరులు నివేశిత స్థలాల కొరకు అర్జీలను స్పందనలో దాఖలు చేసారు. గుడివాడ పట్టణం బేతవోలు నివాశి వుయ్యూరి వీరరాఘవులు, మల్లాయి పాలెంకు చెందిన ఎల్.వెంకటరమణ వైఎస్ఆర్ పెన్షన్ కొరకు అర్జీలను ధాఖలు చేసారు. నందివాడ మండలం గణేష్ నగర్ విష్ణువిలాసిని సంస్థ పంచాయితీలే అవుట్ ద్వారా నిర్మించిన హద్దులను సమీప రైతులు తొలగిస్తున్నారని తొలగించకుండా న్యాయంచేయాలని నిర్వాశితులు కోరారు. గతంలో సర్వేనెం.325,ప్లాట్ నెం.809 ద్వారా గుడివాడ బేతవోలులో 48 చ.గ. ప్రభుత్వ అందించిందని అయితే ప్రస్తుతం ఆస్థలం యొక్క హద్దులు తెలియడం లేదని అధికారులు సర్వే చేయించి నాకు కేటాయించిన ఇంటిస్థలాన్ని ఇప్పించాలని కోరారు. పెదపాలపర్రు మండలం పాములపాడు నివాశి తమ అర్జీలో తనకు పాములపాడు గ్రామంలో ఎకరం 78 సెంట్ల మాగాణి భూమి ఉందని అయితే ప్రస్తుతం ఆభూమి ఆన్ లైన్ అడంగల్లులో వేరొకరి పేరున ఉందని దయచేసి అధికారులు తన భూమిని తన పేరున నమోదు చేయాలిసిందిగా కోరారు.  

Just In...