Published On: Sat, May 23rd, 2020

ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర

* ప్ర‌జ‌ల‌కు నిబద్ధతతో సేవలందించండి

* యువ ఐఏఎస్‌ అధికారులతో సీఎం జగన్

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 2019 బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శ‌నివారం మ‌ర్యాద‌పూర్వంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా యువ ఐఏఎస్‌ అధికారులను సీఎం జ‌గ‌న్ అభినందించారు. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందిండం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అని, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటును యవ అధికారులకు ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ వివరించారు. వాలంటీర్ల వ్యవస్ధ, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సీఎంతో చర్చించామని ఈ సంద‌ర్భంగా యువ ఐఏఎస్‌లు తెలిపారు. ముస్సోరిలోని తమ శిక్షణలో కూడా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధతో పాటు అధికార వికేంద్రీకరణపై కూడా పలుమార్లు చర్చ జరిగిందని ప్రొబెషనరీ ఐఏఎస్‌లు గుర్తుచేశారు. జాతిపిత మ‌హాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుంద‌ని, మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం మంచి చిత్తశుద్ధితో ఉంద‌ని, నిన్నటివరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నాం అని యువ ఐఏఎస్‌లు తెలిపారు. కొత్తగా అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్లు వ్యవస్ధ, అధికార వికేంద్రీకరణ వంటి కొత్త వ్యవస్ధలో పనిచేయడంపై ఈ సంద‌ర్భంగా యువ ఐఏఎస్ అధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

సీఎం జగన్‌ను కలిసిన 2019 బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు వీరే…

* నవీన్‌.ఎం
* నిధి మీనా
* చహత్‌ బాజ్‌పాయ్‌
* వికాస్‌ మర్మత్‌
* వి.అభిషేక్‌
* జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌
* సి.విష్ణుచరణ్‌
* కట్టా సింహాచలం
* అపరాజిత సింగ్‌ సిన్సివర్‌
* భావన వశిష్ట్‌

 

Just In...