Published On: Mon, Jul 6th, 2020

ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి

* న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు సూచ‌న‌
* ట్రాఫిక్‌ పోలీస్ సిబ్బందికి కిట్ బ్యాగ్ పంపిణీ
విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: మునుపెన్న‌డూ చూడ‌ని ‌క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా పోలీస్ సిబ్బంది రోగనిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు సూచించారు. విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా నగరంలో నిత్యం ట్రాఫిక్‌ను క‌మబద్దీకరీస్తూ వాహనాల రాకపోకలను సుగమం చేసేందుకు కాలంతో నిమిత్తం లేకుండా నిత్యం రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వర్షాకాలంలో వర్షం నుంచి అలాగే కాలుష్యం నుండి రక్షణ కల్పించేందుకు ట్రాఫిక్ సిబ్బందికి కిట్ల‌ను న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సోమ‌వారం అంద‌జేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విజయవాడ ట్రాఫిక్ విభాగంలో పని చేయుచున్న హోంగార్డు నుండి ఏసిపి స్థాయి అధికారి వరకు థర్మల్ ప్లాస్క్, నోస్ మాస్క్‌లు-2, న్యాప్‌కిన్స్‌-2, వైట్ టెరికాట‌న్ ష‌ర్ట్‌(క్లాత్‌), రైన్ కోటుతో కూడిన ట్రాఫిక్ కిట్ బ్యాగులను సీపి వారికి అందించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా వైరస్ నుండి సిబ్బంది తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల‌ని, ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్లు, హ్యాండ్ గ్లోవ్స్ ధరించాలని, తరచుగా శానిటైజర్లను రాసుకోవాలని, విధి నిర్వహణలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వేడి నీటిని తప్పకుండా త్రాగాలని ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. గత కొంత కాలంగా కొన్ని ముఖ్యమైన కూడళ్ళలో ఆగిపోయిన సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని మరియు రోడ్లపై వాహనాల పార్కింగ్‌ను క్రమబద్దీకరించాలని, ఎవరైనా ట్రాఫిక్ నియమాలు అతిక్రమణలపై హెచ్చరించి ఈ-చలానాలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడిసిపి బి.రవిచంద్ర, ఏసిపి వై.బి.పి.టి.ఎ.ప్రసాద్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Just In...