Published On: Tue, Sep 17th, 2019

ప్రతి ఓటరు తమ వివరాలు ఆన్‌లైన్‌లో సరి చూసుకునే అవకాశం

* గుడివాడ‌ ఆర్డీవో జి.వి.సత్యవాణి

సెల్ఐటి న్యూస్‌, గుడివాడ: తప్పులు లేని ఓటర్ల జాబితా కొరకు  భారత ఎన్నికల సంఘం (ఈ.వి.పి) కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఓటర్లు తమ వివరాలు ఆన్‌లైన్‌లో సరి చూసుకునే అవకాశాన్నికల్పించిందని ఆర్డీవో జి.వి.సత్యవాణి మంగ‌ళ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లు తమ వివరాలు సరి చూసుకోవడానికి  కొన్ని సౌకర్యాలు కల్పించిందని పేర్కొన్నారు. ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా, ఎన్నికల సంఘం వారి ఎన్. వి.ఎస్.పి. పోర్టల్‌లో  https://nvsp.in/ ద్వారా గాని సాధారణ సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లడం ద్వారా గాని  ఓటర్ నమోదు అధికారి( ఈ ఆర్ వో) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయక కేంద్రానికి గాని వెళ్లి ఓటర్లు తమ వివరాలు సరిచూసుకొని సవరణ చేసుకోవచ్చునని కావున గుడివాడ డివిజ‌న్ పరిధిలోని ప్రతి ఓటరు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభా వంతులైన ఓటర్ల సౌకర్యార్థం తప్పోప్పుల సవరణకు 1950 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి సరిచేసుకోవచ్చునని తెలిపారు.  ఓటర్లు తమ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేక ఏమైనా తప్పులు సవరించాల అనే వివరాలు, వారి ఫోన్ నెంబరు ఈఆర్‌ఓ కార్యాలయంలోని ఓటరు సహాయక కేంద్రంలో ఏదైనా ఒక గుర్తింపు దృవపత్రం నకలుతో కలిపి సమర్పించాలన్నారు. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలు అనగా ఓటర్ పేరు,  ఫోటో, పుట్టిన తేదీ ,వయసు, బంధువుల పేరులో, చిరునామాలో తప్పులు సరి చూసుకొని వాటిని సవరించుటకు గాను భారతీయ పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ,రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేయబడే ఫోటో గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, రైతులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒక దృవ పత్రం నకలు సమర్పించాని తెలిపారు.  తమ కుటుంబంలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఎవరైనా మరణించిన లేక శాశ్వతంగా వలసపోయిన ఫారం-7 ద్వారా తెలియజేయాలన్నారు. తమ పరిదిలో గల  పోలింగ్ కేంద్రం సక్రమంగా లేని యెడల ప్రత్యామ్నాయ భవన వివరాలు సూచించవచ్చు  తెలిపారు.  ఈ అవకాశం సకాలంలో సద్వినియోగం చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీవో సత్యవాణి కోరారు. అదే విధంగా  ఓటర్లు తమ స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్లో ద్వారా కూడా మార్పులు చేర్పులు చేసుకొన అవకాశం ఉందని అయితే ఇందుకోసం ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆర్డీవో సత్యవాణి తెలిపారు.

 

Just In...