Published On: Sat, Aug 10th, 2019

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

* ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి

సెల్ఐటి న్యూస్, విజయవాడ: ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, వాటి విధానాలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పన్నులు కట్టే విధానంపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. బెంజిసర్కిల్ వద్ద గల మెట్రోపాలిటన్ హోటల్ లో నందు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్, ట్యాక్సేషన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సెమినార్ జరిగింది. ఈ సెమినార్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికీ పన్నుల విధానం గురించి తెలియచేయడంతో పాటు, పన్నులలో వచ్చిన కొత్త చట్టాలు, మార్పులు గురించి తెలుసుకోవడానికి ఇటుంటి సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీఎస్టీలో వచ్చిన మార్పులు, చట్టాల గురించి వివిధ ఛార్టడ్ అకౌంటెంట్లు వివరించారు. సెమినార్ కన్వీనర్ ఎస్.చక్ర రమణ మాట్లాడుతూ పన్నుల విధానంలో వచ్చిన మార్పులు గురించి అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా కొత్తగా వచ్చిన చట్టాలు, సెక్షన్లు గురించి తెలుసుకోవడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఒక రోజు అవగాహన సదస్సులో విజయవాడ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  గడ్డం సత్యనారాయణ, సెక్రటరీ బివిఎస్ లింగమూర్తి, న్యాయవాదులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Just In...