Published On: Tue, Jun 12th, 2018

ప్రధానిని కలిసిన ఏపీ భాజ‌పా అధ్యక్షుడు కన్నా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: త‌న‌పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి చెప్పిన‌ట్లు ఏపీ భాజ‌పా అధ్య‌క్షు8డు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. మంగ‌ళ‌వారం ప్ర‌ధానిని క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికలలో ఏపీలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చేస్తున్నాం.. చేశాం.. చేస్తామని మోదీ తెలిపార‌ని క‌న్నా పేర్కొన్నారు. చంద్రబాబు మోసం చేసినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ ఏపీ ప్రజలకు చెప్పమన్న‌ట్లు తెలిపారు. చట్టంలో ఉన్న 85 శాతం అంశాలు పూర్తి చేశాం, ఏపీ ప్రజల వెంట తాను ఉంటానని మోదీ తెలిపార‌ని వివ‌రించారు. ఏపీకి సంబంధించిన 12 అంశాలు పూర్తిచేయాలని ప్రధానికి నివేదిక ఇచ్చిన‌ట్లు తెలిపారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు నిధుల పెంపు, విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు, రామాయపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు జిఎస్టీ టాక్స్ ఇన్సెన్టివ్స్, నాలుగు రాయలసీమ జిల్లాలకు పారిశ్రామిక కారిడార్, గిరిజన, మత్స్యకారుల అభివృద్ధికి నిధులు, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని మోదీకి విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వివ‌రించారు.

Just In...