Published On: Thu, Sep 17th, 2020

ప్రధాని మోదీకి గ‌వ‌ర్న‌ర్ జన్మదిన శుభాకాంక్షలు

రాజ్ భ‌వ‌న్ (విజయవాడ), సెల్ఐటి న్యూస్‌: దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని ఉద్దేశించి రాసిన లేఖలో గవర్నర్ హరిచందన్ మోదీ పుట్టినరోజు నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం పలు ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కుందని, ప్రధాని మార్గనిర్ధేశకత్వంలో కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుండి సైతం మన దేశం త్వరలోనే విజయవంతంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశాన్ని తన రాజకీయ చతురత, నేర్పు, ఓర్పుతో నరేంద్రమోదీ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ప్రధాని మంచి ఆరోగ్యం, ఆనందాలతో ఫలవంతమైన జీవితం గడపాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Just In...