Published On: Thu, Aug 15th, 2019

ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మనదే

* తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

సెల్ఐటి న్యూస్, హైదరాబాద్: ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మనదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. స్వలాభం, కుటుంబ బంధాల వంటి వాటిని తృణప్రాయంగా భావించిన ఎందరో వీరుల త్యాగఫలం నేటి మనదేశమని ఆయన అభివర్ణించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఉంచడం మన బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన 73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని తరాల పోరాటం, దేశప్రజల త్యాగం, సహకారం, ఐక్యతవల్లే దేశానికి స్వేచ్ఛ లభించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అలాంటి జాతీయతా స్పూర్తిని మనలో కలిగించిన మహానుభావులందరినీ స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు.

Just In...