Published On: Sun, Oct 25th, 2020

ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదగాలి…

* క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌లు బ‌య‌ట ప‌డాల‌ని జ‌గ‌న్మాత‌ను వేడుకున్నా‌

* దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం నాడు విజయవాడకు వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కరోనా మహమ్మారి నుండి ప్రజలు అందరూ బయటపడాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అలాగే పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని కోరానని చెప్పారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదగాలని, దేశ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాలు ఉండాలని అమ్మవారిని కిషన్ రెడ్డి వేడుకున్నారు.

Just In...