Published On: Mon, Aug 2nd, 2021

ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి

* సూపరింటెండెంట్ డాక్టర్ మెట్లపల్లి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాన‌ని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మెట్లపల్లి జగన్మోహ‌న్‌రావు అన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో రోగుల అవసరాలకు తగిన‌ట్లుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని వయసుల వారికి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తాన‌న్నారు. రోగుల‌కు విశేష వైద్య సేవలు లభించేలా వైద్యులు, సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతాన‌న్నారు. డాక్టర్ జగన్మోహన్‌రావుకు గతంలో రెండు పర్యాయాలు 2012, 2016-17 సంవత్సరాల్లో సూపరింటెండెంట్‌గా సమర్థంగా తన సేవలు అందించిన ఘనత ఉంది.

Just In...