Published On: Fri, Jun 14th, 2019

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచార ప్రాధాన్యం

* సమాచార శాఖ కమీషనర్ విజ‌య్‌కుమార్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన టి.విజయ్‌కుమార్ రెడ్డి శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులోని పబ్లిసిటీ సెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు సకాలంలో అందిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే పబ్లిసిటీ సెల్‌లో మీడియాకు అందుబాటులో గల సౌకర్యాలు అనగా కంప్యూటర్లు, ఇంటర్నెట్, వైఫై వంటి వివిధ సౌకర్యాలపై పై ఆరా తీశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా అవగాహన కలిగేలా వివరిస్తూ విస్తృత ప్రచారం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు డి.శ్రీనివాస్, చీఫ్ ఇన్పర్మేషన్ ఇంజనీర్ ఒ.మధుసూదన్, పబ్లిసిటీ డిప్యూటీ డెరెక్టర్ ఐ.సూర్యచంద్రరావు, పిఆర్ఓలు ఈశ్వర్ ప్రసాద్, వి.రామాంజనేయులు, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Just In...