Published On: Wed, Jan 9th, 2019

ప్రవాసాంధ్ర దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

* ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అందించే సేవల కరపత్రాలను విడుదల 

* ఏపీ ఎన్ఆర్టీ ద్వారా యువతకు అందించే నైపుణ్యాఅభివృది శిక్షణ గురించి చర్చించిన ముఖ్యమంత్రి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. జనవరి 9వ తేదీ ప్రవాసాంధ్ర దివస్ ఐన సందర్భంగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులు ఉండవల్లి నివాసం వద్ద బుధవారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. ప్రవాసాంధ్ర దివస్ పోస్టర్ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవల కరపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువత నైపుణ్య సామర్థ్యం పైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కావున యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఏ దేశాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయో ఆయా దేశాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఏపీ ఎన్ఆర్టీకి సూచించారు. అమరావతిలో ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నైపుణ్య శిక్షణలో ప్రాధాన్యత సంతరించుకున్న ఇంటర్నేషనల్ ఏజెన్సీలను సర్వీస్ ప్రొవైడర్స్ గా నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర విభజన తరువాత విదేశాల నుండి అమరావతికి వచ్చి.. పరిశ్రమలు స్థాపించి ఇక్కడే ఉంటున్న పలువురు పారిశ్రామివేత్తలను సీఎం చంద్ర‌బాబు నాయుడు అభినందించారు. వ్యాపార ఉత్పత్తులలో ప్రపంచ స్థాయి కొత్త ఉత్పత్తులను అమరావతికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఏన్ఆర్టీ అఫైర్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ సలహాదారు రవి కుమార్ వేమూరు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఆంద్రప్రదేశ్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. త్వరలో నాలుగు కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కడప జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు రవి ముఖ్యమంత్రికి తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ కె.భవానిశంకర్, తానా అధ్యక్షుడు సతీష్‌కుమార్, కోఆర్డినేటర్ బుచ్చి రాము, ఏపీ ఎన్ఆర్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Just In...