Published On: Wed, Oct 9th, 2019

ప్రవేటు ట్రావెల్స్‌పై ర‌వాణాశాఖ ఉక్కుపాదం

* నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహ‌కుల‌పై 42 కేసులు న‌మోదు

* దీపావ‌ళి పండ‌గ వ‌ర‌కు నిరంత‌ర త‌నిఖీలు

* టీటీసీ వెంక‌టేశ్వ‌రరావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: దసరా పండుగ సందర్భంగా ప్రవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అడ్డ‌దారిన ప్రయాణికుల నుండి అధిక టిక్కెట్ ధరలు వసూలు చేస్తున్న నైపద్యంలో కృష్ణా జిల్లా రవాణా శాఖ మంగ‌ళ‌వారం ప్రత్యేక బృందాలలతో తనిఖీలు చేపట్టింది. ఈ క్ర‌మంలో అధిక ధ‌రలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రవేటు ట్రావెల్స్‌ను గుర్తించి 42 కేసులు నమోదు చేసింది. గ‌రికపాడు చెక్‌పోస్టు, పొట్టిపాడు టోల్‌ప్లాజా, కీసర టోల్‌ప్లాజాల వద్ద జరిపిన ప్రత్యేక తనిఖీల్లో గత ఐదు రోజులలో 295 కేసులు నమోదు చేసిన‌ట్లు డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా 6 బస్సులు సీజ్ చేయ‌డంతో పాటు అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు రూ.25 వేలు జరిమానా విధించిన‌ట్లు చెప్పారు. మూడు రోజులలోపు అపరాధ రుసుము రూ.25వేలు చెల్లించకపోతే బస్సులు సీజ్ చేస్తాం అని హెచ్చ‌రించారు. ప్రయాణికుల నుండి అధిక ధరలు వసులుచేస్తే సహించేదే లేద‌న్నారు. ప్ర‌త్యేక బృందాలతో దీపావళి పండుగ వరకు తనిఖీలు కొనసాగిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్రవేట్ ట్రావెల్స్‌కు సంబంధించిన రికార్డులను రవాణాశాఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రయాణికులు చూసుకోవచ్చ‌ని తెలిపారు. బస్సుకు టాక్స్ కట్టకపోయిన, ఫిట్‌నెస్, పర్మిట్ లేకపోయినా బస్సులను ఎక్కోద్ద‌ని టీడీసీ వెంకటేశ్వరరావు ప్ర‌యాణికుల‌కు సూచించారు.

 

Just In...