Published On: Tue, Apr 6th, 2021

ప్రాంగ‌ణ ఎంపిక‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థుల‌కు ఉపాధి

విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌, సెల్ఐటి న్యూస్‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శిక్షణ ఉపాధి విభాగం ఆధ్వర్యంలో గన్నవరం మేధా టవర్స్ నుండి సేవలందిస్తున్న ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం స్టేట్ స్ట్రీట్ హెచ్‌సీఎల్ సర్వీసెస్ ఇటీవల ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో తమ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. తమ కళాశాలలో బీకాం, బీబీఏ మరియు ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులు ఆన్లైన్ మాధ్యమం ద్వారా రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు హెచ్ ఆర్ ఇంటర్వ్యూలలో పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ చూపిన తొమ్మిది మంది డిగ్రీ విద్యార్థులు ఐదుగురు ఎంబీఏ విద్యార్థులు ఉపాధి అవకాశం సాధించినట్లు కళాశాల శిక్షణా విభాగం అధికారి కావూరి శ్రీధర్ తెలియచేశారు. ఎంపికైన విద్యార్ధులు చివరి సంవత్సరం పరీక్షల అనంతరం గన్నవరంలోని స్టేట్ స్ట్రీట్ హెచ్.సీ.యల్ కార్యాలయంలో రూ.2లక్షలు వార్షిక వేతనంతో ప్రవేశం పొందుతారని వెల్లడించారు. ఉపాధి అవకాశం పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

 

Just In...