Published On: Wed, Dec 4th, 2019

ప్రాంగ‌ణ ఎంపిక‌లో 29 మంది విద్యార్థుల‌కు ఉద్యోగాలు..

 సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీకాం, బీబీఏ మరియు బీఏ చివరి సంవత్సరం విద్యార్థులు 29 మంది ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఇన్ఫోసిస్ బీపీఓ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఉపాధి అవకాశాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ బుధ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల  3న తెనాలి ఏఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో విద్యార్థులు 88 మంది పాల్గొనగా ఆంగ్ల వ్యాసరచన, బృంద చర్చలు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనే మూడు దశలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 29 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు కళాశాల ఉపాధి విభాగం అధికారి కావూరి శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఇన్ఫోసిస్ మానవ వనరుల నిపుణులు అవినాష్, వెంకటేష్ ప్రసాద్ పాల్గొని విద్యార్థుల‌కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, ఉపాధి విభాగం సహాయాధికారి డి.విజయ్‌కుమార్, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Just In...