Published On: Mon, Apr 15th, 2019

ప్రాంగ‌ణ ఎంపిక‌ల‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థుల‌కు ఉద్యోగాలు

* కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు పది మంది ప్రముఖ బహుళ జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ క్యాప్ జెమిని నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్‌వేర్ అసోసియేట్లుగా ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇటీవల సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలలో పాల్గొని ఆన్‌లైన్ పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ ఆర్ ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసి తమ విద్యార్థులు ఉపాధి అవకాశాన్ని పొందినట్లు క‌ళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు పేర్కొన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మరియు బీసీఏ కోర్సులకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులు కాత్యాయని, నాగ భార్గవి, షేక్ రహీం భాషా, లక్ష్మీ స్రవంతి, మహమ్మద్ ఇక్రమ్, ప్రశాంత్, లోకేష్ కుమార్ రెడ్డి, భావన, అనుమోలు హర్ష, మహమ్మద్ అమీర్ ప్రాంగణ ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రూ.2.50 లక్షల వార్షిక వేతనంతో ఈ అవకాశాన్ని సాధించినట్లు కళాశాల ఉపాధి విభాగ అధికారి కావూరి శ్రీధర్ తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులను యాజమాన్యం తరపున సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు అభినందించారు.

Just In...