Published On: Tue, May 15th, 2018

ప్రారంభానికి సిద్ధంగా మోడ‌ల్ పోలీస్ క్వార్ట‌ర్స్‌

* డీజీపీకి వెల్ల‌డించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నాగుల్‌మీరా 
సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ద్వారా రాష్ట్రంలో మోడ‌ల్ పోలీస్ క్వార్ట‌ర్స్ నిర్మాణం దాదాపుగా పూర్తైంద‌ని, త్వ‌ర‌లోనే వాటి ప్రారంభానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కె.నాగుల్‌మీరా రాష్ట్ర డీజీపి మాల‌కొండ‌య్య‌కు వివ‌రించారు. ఈ విష‌య‌మై మంగ‌ళ‌వారం ఉద‌యం డీజీపీ మాల‌కొండ‌య్య‌ను విజ‌య‌వాడలో నాగుల్‌మీరా క‌లిసి మాట్లాడారు. ఏలూరు, నూజివీడు, అనంత‌పురం ప్రాంతాల్లో 1030 చ‌ద‌రపు అడుగుల‌తో, సుమారు రూ.35 ల‌క్ష‌ల వ్య‌యంతో పోలీస్ క్వార్ట‌ర్స్ నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకుంద‌ని డీజీపికి వివ‌రించారు. ఈ విష‌య‌మై త్వ‌ర‌లోనే సీఎం చంద్ర‌బాబును క‌లిసి పోలీస్ క్వార్ట‌ర్స్ ప్రారంభోత్స‌వానికి సంబంధించి చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో మోడ‌ల్ పోలీస్ స్టేష‌న్ల‌ను నిర్మించేందుకు కూడా ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ రూపొందించిన‌ట్లు నాగుల్‌మీరా డీజీపికి వివ‌రించారు.

Just In...