Published On: Tue, Nov 20th, 2018

ప్రియుడు మోసం చేశాడ‌ని యాసిడ్ తాగిన యువ‌తి

* విజయవాడలో దారుణం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ప్రేమ పేరుతో విజ‌య‌వాడ‌కు పాత‌బ‌స్తీలోని కొత్తపేటకు చెందిన యువతిని మోసం చేయ‌డంతో ఆ యువ‌తి మంగ‌ళ‌వారం యాసిడ్ తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. గోపికృష్ణ అనే యువకుడు ఇటివల ప్రేమించిన యువతికి తెలియకుండా మరో యువతిని పెళ్ళిచేసుకోవ‌డంతో విష‌యం తెలుసుకున్న ప్రియురాలు ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. ప్రియుడు మ‌రో పెళ్లి చేసుకున్నాడ‌న్న విషయం తెలుసుకున్న ప్రియురాలు పాయ‌కాపురం శాంతినగర్‌లోని యువకుడు ఇంటి ముందు యాసిడ్ త్రాగింది. యువతి అపస్మారక స్ధితిలోకి వెళ్ళడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...