Published On: Thu, Jul 9th, 2020

ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అచ్చెన్నాయుడికి అనుమతి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన్న ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తాజాగా విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించే అంశంపై బుధ‌వారం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై గత నెల 12న అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏసీబీ కస్టడీలోనే ఉంటున్నారు.

Just In...