Published On: Fri, Nov 8th, 2019

ప్ర‌కాశం బ్యారేజీపై నుంచి దూకి వివాహిత ఆత్మ‌హ‌త్య‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజ‌య‌వాడ ప్రకాశం బ్యారేజీపై 62వ ఖానా వ‌ద్ద నుంచి కృష్ణా న‌దిలోకి దూకి ఓ వివాహిత గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్ప‌డింది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడేందుకు విఫలయత్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. న‌దిలో ఓవైపు వరద ఉదృతి అధికంగా ఉండడంతో పోలీసులు రక్షించలేకపోయారు. మహిళ ఎవ‌రూ అనేదానిపై పోలీసులు స‌మ‌గ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్షంగా చూసిన పాద‌చారులు మృత‌దేహాన్ని చూసి కంట‌త‌డి పెట్టారు.

Just In...