Published On: Tue, Oct 16th, 2018

ప్ర‌జ‌లంద‌రికీ ర‌ఘువీరారెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌, విదేశాల‌లో నివ‌సిస్తున్న తెలుగు ప‌్ర‌జ‌లంద‌రికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి దుర్గాష్ట‌మి, విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. చెడుమీద మంచి, దుష్ట‌శ‌క్తుల మీద దైవశ‌క్తులు సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా జ‌రుపుకొనే విజ‌య‌ద‌శ‌మి పండుగ అని, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Just In...